టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్లు విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీ భక్తులకు గుడ్ న్యూస్.. టికెట్లు విడుదల

February 22, 2022

10

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త తెలిపింది. ఫిబ్రవ‌రి 23న (బుధవారం) ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, సర్వదర్శనం టోకెన్ల అద‌న‌పు కోటా టికెట్లను విడుద‌ల చేసింది. శ్రీ‌వారి ద‌ర్శనానికి సంబంధించి ఫిబ్రవ‌రి 24 నుంచి 28 వ‌ర‌కు అద‌నంగా రోజుకు 13,000 చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్లను రేపటి నుంచి టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచ‌నుంది. అంతేకాకుండా ఫిబ్రవ‌రి 26 నుండి 28 వ‌ర‌కు అద‌నంగా రోజుకు 5,000 చొప్పున స‌ర్వద‌ర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో తిరుప‌తిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన‌ కౌంట‌ర్లలో ఇస్తారిని తెలిపింది.

మరోపక్క మార్చి నెల‌కు సంబంధించి, రోజుకు 25 వేల చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవ‌రి 23న ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ కోరింది.