టీవీ ప్రియులకు ఈ కామర్స్ సంస్థలు శుభవార్తను తెలిపాయి. ఇటీవలే ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో సేల్‌ను ప్రారంభించిన సంస్థ.. సేల్‌లో భాగంగా అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌పై ఆఫర్లను ప్రకటించింది. మార్చి 12న ప్రారంభమైన ఈ సేల్.. మార్చి 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ఆఫర్లో భాగంగానే రూ. 30 వేలు విలువైన స్మార్ట్ టీవీని కేవలం రూ. 7500కే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. 42 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ. 7,749కే సొంతం చేసుకోవాలని కోరింది. అయితే ఎలా తీసుకోవాలి అనే విషయాలను కూడా వెలువరించింది.
ఫ్లిప్ కార్ట్ బ్లౌపంక్ట్ కంపెనీకి చెందిన సైబర్ సౌండ్ అనే స్మార్ట్ టీవీపై ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 42 అంగుళాల ఈ స్మార్ట్ టీవీ అసలు ధర రూ. 29,999గా ఉంది. అయితే ఆఫర్లో భాగంగా ఫ్లిప్ కార్ట్ టీవీపై 33 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. దీంతో టీవీ రూ. 19,999కే అందుబాటులో ఉంది. ఒక వేళ ఈ టీవీని ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అంటే రూ. 18,749కే టీవీని సొంతం చేసుకోవచ్చు. టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుందని తెలిపింది. మీ పాత టీవీని ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా గరిష్టంగా రూ. 11,000 వరకు ఆదా చేసుకోవచ్చువని తెలిపింది. ఒకవేళ మీరు ఇచ్చే టీవీకి పూర్తి ఆఫర్ వర్తిస్తే ఈ కొత్త టీవీని రూ. 7,749కే సొంతం చేసుకోవచ్చు అని తెలిపింది.