Good news for Vijay fans..Liger ready
mictv telugu

 విజయ్ అభిమానులకు గుడ్‌న్యూస్..లైగర్ రెడీ

June 24, 2022

Good news for Vijay fans..Liger ready

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ‘లైగర్’ చిత్రబృందం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ‘లైగర్’ చిత్రాన్ని ఆగస్టు 25న విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్‌ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా షూటింగు చివర దశకు చేరుకుందంట. కేవలం ఓ ఫైనల్ సాంగ్ మాత్రమే ఉందట. ఆ సాంగ్‌ను షూట్ చేస్తే సినిమా మొత్తం కంప్లీట్ అయ్యి, ప్రమోషన్‌ను చేయడానికి రెడీ అవుతామని అని చిత్రబృందం తెలిపింది.

దీంతో విజయ్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ఆ సాంగ్‌కు సంబంధించి టాకీపార్ట్ మొత్తం పూర్తి చేశారని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ శరవేగంగా జరుగుతోందని విజయ్ అభిమానులు నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు.

ఇక, లైగర్ విషయానికొస్తే..విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక, ఈ సినిమాలో మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి, కరణ్ జొహార్‌లు కలిసి ఈ సినియాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విజయ్ దేవరకొండకు ‘లైగర్’ మొదటి పాన్ ఇండియా చిత్రకావడంతో దాదాపు 6 వారాల ముందు నుంచే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలవబోతున్నట్టు తెలుస్తోంది.