దేశవ్యాప్తంగా ఉన్న వాచ్ ప్రియులకు రియల్ మీ సంస్థ ఓ శుభవార్తను చెప్పింది. తమ కంపెనీ నుంచి తాజాగా తయారు చేసిన వాచ్ 3 తొలి అమ్మకాలను నేటి నుంచే మొదలు పెట్టామని పేర్కొంది. ఈ వాచ్‌లు యాపిల్ ప్రీమియంను పోలి ఉంటాయని, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగానే ధరలను నిర్ణయించామని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అంతేకాదు, ఈ వాచ్‌ల ప్రత్యేకత ఏంటీ? ఏఏ ప్యూచర్స్ ఉన్నాయి? ధర ఎంత? అనే తదితర విషయాలను వెల్లడించింది.
”దీని ధర రూ.3,499. ఆరంభంలో కొనుగోలు చేసే వారికి రూ.500 తగ్గింపు లభిస్తుంది. అంటే రూ.2,999కే దీనిని సొంతం చేసుకోవచ్చు. ఇది పరిమిత కాలం పాటు ఉండే ఆఫర్ మాత్రమే. రిటైల్ స్టోర్లలో, ఫ్లిప్ కార్ట్‌లో కొనుగోలు చేసుకోవచ్చు. బ్లాక్, గ్రే రంగుల్లో లభిస్తుంది. ప్లాస్టిక్‌తో చేసిన వాచ్ ఇది.
1.8 అంగుళాల డిస్ప్లే, ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. ఈ వాచ్‌లో 110 రకాల డిస్ప్లే ఫేస్‌లను ఎంపిక చేసుకోవచ్చు. ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్‌తోపాటు యాపిల్ ఫోన్లకు సైతం కనెక్ట్ చేసుకోవచ్చు. నిద్రపోయే తీరు, రోజువారీగా ఎన్ని అడుగులు నడుస్తున్నారు? గుండె స్పందనల రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయులు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉంది?. ఇలా ఎన్నింటినో ఈ వాచ్ ట్రాక్ చేయగలదు. రియల్ మీ వాచ్ 3 నుంచి బ్లూటూత్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే, స్మార్ట్ వాచ్ లోనే కాల్స్ రిసీవ్ చేసుకుని మాట్లాడొచ్చు. వాచ్‌లో మైక్రోఫోన్, స్పీకర్ కూడా ఉన్నాయి.” అని కంపెనీ యాజమాన్యం పేర్కొంది.