mictv telugu

18 వేల పోలీసు పోస్టులకు నోటిఫికేషన్లు

May 31, 2018

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల నోట్లో చక్కెర పోసింది. గతంలో ప్రకటించినట్లుగానే మొత్తం 18,428 పోలీసు కొలువుల భర్తీ కోసం తెలంగాణ పోలీసు నియా మక సంస్థ నోటిఫికేషన్లను ఈ రోజు విడుదల చేసింది.

పోస్టుల వివరాలు..

Telangana government issued notification for 18000 police jobs 01

police post notification (1)

police notificaton2

police notification2 (1)

కానిస్టేబుల్స్ 16,767, ఎస్సై 739, ఏఎస్సై 26, ఆర్ఎస్సై 471, ఫైర్ మెన్ 168, వార్డెన్స్ 221, , స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 19, డిప్యూటీ జైలర్15, అసిస్టెంట్ మ్యాట్రన్ 2.  పోలీసు నియామక బోర్డు ద్వారా పోస్టులను భర్తీ చేస్తారు. విద్యార్హతల ఇతర వివరాల కోసం నోటిఫికేషన్లలో చూడొచ్చు. మొత్తం 18428 ఉద్యోగాల కోసం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేశారు. కానిస్టేబుల్ పోస్టులకు  ఇంటర్మీడియెట్‌ ప్రధాన అర్హత. జూన్‌ 9 నుంచి 30వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపాలి. కొన్ని పోస్టులకు మాత్రమే గరిష్ట వయోపరిమితి ఇచ్చారు. హోంగార్డుగా ఏడాది పనిచేసిన వారికి  సడలింపు ఇచ్చారు. రాత పరీక్ష, శరీర దారుఢ్య పరీక్ష తదితరాలను నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారు.

good news for youth notifications released for fulfill constable posts in Telangana