Good news.. Free booster dose from tomorrow
mictv telugu

గుడ్‌న్యూస్.. రేపటి నుంచే ఉచిత బూస్టర్ డోస్

July 14, 2022

కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు ఓ శుభవార్తను చెప్పారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి రేపటి నుంచి (శుక్రవారం) దేశవ్యాప్తంగా 18సంవత్సరాలు పైబడిన వారందరికీ ఉచి తంగా కొవిడ్ టీకా బూస్టర్ డోస్‌ను ఇవ్వనున్నట్లు బుధవారం పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ బూస్టర్ డోస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు విషయాలపై చర్చించి, ఉచిత బూస్టర్ డోస్‌కు ఆమోదముద్ర వేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగి సింగ్ ఠాకుర్ మాట్లాడుతూ..”అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో 75 రోజులపాటు ఈ ఉచిత బూస్టర్ డోస్ అందిస్తాం. దీనికి ఎంత ఖర్చయినా కేంద్రమే భరిస్తుంది. ఇది ప్రజల కోసం తీసుకున్న పెద్ద నిర్ణయం. ఇప్పటివరకు దేశ ప్రజలకు 190 కోట్ల కరోనా టీకా డోసులు అందించాం. వీటిలో 18 ఏళ్లు పైబడినవారి వాటాయే 181 కోట్లకు పైగా ఉంది. 60 ఏళ్లు పైబడినవారు, వైద్య సిబ్బంది, కొవిడ్ వారియర్లకు ప్రస్తుతం ఉచితంగా బూస్టర్ డోసు ఇస్తున్నాం. వీరిలో 25.84 శాతం మందికి ఇవి అందాయి. ఇప్పుడు అందరికీ ఇవి విస్తరిస్తుంది” అని అయన అన్నారు.