రైళ్లలో జనరల్ టికెట్లకూ సీట్లు కన్ఫామ్ - MicTv.in - Telugu News
mictv telugu

రైళ్లలో జనరల్ టికెట్లకూ సీట్లు కన్ఫామ్

December 3, 2019

తరచూ జనరల్ బోగీల్లో ప్రయాణించే వారికి రైల్వే సంస్థ శుభవార్త తెలిపింది. ఇకపై జనరల్ బోగీల టిక్కెట్లకు సీట్లు కన్ఫామ్ కాబోతున్నాయి. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం రిజర్వేషన్ టిక్కెట్లకు మాత్రమే ఉండేది.  రైల్వే ప్రయోగాత్మకంగా ఈ కొత్త సర్వీస్‌ను ప్రవేశపెట్టింది. జనరల్ కంపార్ట్‌మెంట్ టికెట్లు తీసుకున్నవారికి కూడా కన్ఫామ్డ్ సీట్లు ఇస్తోంది. 

ఈ టికెట్లను కౌంటర్లలోనే కొనాల్సి ఉంటుంది. టిక్కెట్ తీసుకునే సమయంలో ప్రయాణికుడి ఐడీ కార్డును ఫోటో తీస్తారు. ఆ ఫొటోతో కూడిన డిజిటల్ టిక్కెట్ ప్రయాణికుడి వాట్సాప్ నంబర్‌కు వస్తుంది. ప్రయాణికులు రైలు ఎక్కి వాళ్లకు కేటాయించిన సీటులో కూర్చోవచ్చు. ప్లాట్‌ఫామ్‌పై అక్రమాలను అరికట్టేందుకు రైల్వే సంస్థ ఈ కొత్త విధానాన్ని తీసుకొని వచ్చింది. ‘పాస్ ఫర్ అన్‌రివార్డెడ్ బోర్డ్-పియుఆర్‌బి’ పేరుతో ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను తూర్పు మధ్య రైల్వేలో దానాపూర్ డివిజన్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఇక్కడ విజయవంతమైతే దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ సర్వీస్‌ను విస్తరిస్తారు.