గుడ్‌న్యూస్.. గ్రూప్స్‌ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌ - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. గ్రూప్స్‌ పోస్టులకు గ్రీన్‌సిగ్నల్‌

March 18, 2022

fbfb

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్స్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబ్ క్యాలండర్‌లో ఇచ్చిన పోస్టులకంటే అదనంగా మరిన్ని పోస్టులను భర్తీ చేసేందుకు శుక్రవారం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది.

ఈ సందర్భంగా గ్రూప్ 1 కేటగిరీ కింద 110 పోస్టులు, గ్రూప్‌-2 కేటగిరీ కింద 182 పోస్టులకు అనుమతి లభించింది. దీంతో ఏపీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్టీవో, సీటీవో, డిఎస్పీ, డిఎఫ్‌ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపిడివో పోస్టుల భర్తీకి, ఇక గ్రూప్‌-2లో డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, మున్సిపల్ కమిషనర్‌లు, ట్రెజరీ అధికారులు తదితర ఖాళీల భర్తీకి వైఎస్‌ జగన్‌ అనుమతి ఇచ్చారు.