Good News .. Jobs in AP, Telangana with Tent Qualification
mictv telugu

గుడ్‌న్యూస్..టెన్త్ అర్హతతో ఏపీ, తెలంగాణలో ఉద్యోగాలు

May 6, 2022

కేంద్రం ప్రభుత్వం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పదోవ తరగతి పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌‌లో మొత్తం 38,926 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టుల్లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి. ఇక, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2,942 పోస్టులున్నాయి. ఇందులో తెలంగాణలో 1,226, ఆంధ్రప్రదేశ్‌లో 1,716 ఉన్నాయి. మరి ఈ ఉద్యోగాలకు ఏ విధంగా ఆప్లై చేయాలి? జీతం ఎంత ఉంటుంది? ఎంపిక విధానం ఎలా ఉంటుంది? అనే పూర్తి వివరాలు మీకోసం..

”10వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాషలో 10వ తరగతి వరకు చదివి ఉండాలి. వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌వుమెన్‌కు ఫీజు లేదు. వేతనం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు రూ.12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000గా ఉంటుంది. టెన్త్‌ క్లాస్‌ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సబ్‌మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ 10వ తరగతి మెమో, ఫోటో, సంతకం. దరఖాస్తులు ప్రారంభం మే 2, 2022, చివరి తేదీ: జూన్ 5, 2022. వెబ్‌సైట్‌:https://indiapostgdsonline.gov.in/” అని అధికారులు వివరాలను వెల్లడించారు.