గుడ్‌‌న్యూస్‌.. బాసర ఆర్‌జీయూకేటీలో ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌‌న్యూస్‌.. బాసర ఆర్‌జీయూకేటీలో ఉద్యోగాలు

March 17, 2022

bbb

నిరుద్యోగులకు రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ శుభవార్త చెప్పింది. తమ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణలోని బాసరలో ఉన్న ఈ సంస్థలో కాంట్రాక్ట్‌ విధానంలో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. మరి ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అనే విషయాలను ఈ క్రింది విధంగా సూచించింది.

భర్తీ చేయనున్న పోస్టులు..
1. గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు

2. ఖాళీలు ఉన్న విభాగాలు..
ఇంజనీరింగ్‌లో భాగంగా సివిల్‌ ఇంజనీరింగ్‌,
కంప్యూటర్‌ సైన్స్‌,
ఇంజనీరింగ్‌,
ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌,
మెటలర్జీ, మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

3. అర్హతలు..

అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌తో పాటు ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పీహెచ్‌డీ అభ్యర్థులకు ప్రాధాన్యమిస్తారు.

4.సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌లో భాగంగా..
కెమిస్ట్రీ,
మ్యాథమెటిక్స్‌,
ఇంగ్లిష్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే వారు 55 శాతం మార్కులతో మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత పొంది ఉండాలి
నెట్‌/ స్లెట్‌/ సెట్‌ అర్హత ఉండాలి
పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి

6.ముఖ్యమైన విషయాలు..
ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 17-03-2022న ప్రారంభం కాగా 21-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
వెబ్‌సైట్: rgukt.ac.in