Good news .. KCR Sarkar green flag for 5,571 posts
mictv telugu

గుడ్‌న్యూస్.. 5,571 పోస్టులకు కేసీఆర్ సర్కార్ పచ్చజెండా

May 19, 2022

Good news .. KCR Sarkar green flag for 5,571 posts

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5,571 పోస్టులకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 5,571 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) కొలువులను ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పిస్తూ, ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుధవారం ఇందుకు సంబంధించిన దస్త్రంపై హరీశ్‌రావు సంతకం చేశారు.

పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ..”గత సంవత్సరం కేసీఆర్..రాష్ట్రంలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో హెచ్ఎంల పోస్టులను 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారమే.. గతంలో ఉన్న 4,429 పోస్టులకు కొత్తగా 1,142 పోస్టులు కలిపి మొత్తం 5,571లకు చేర్చారు. కానీ, కొత్త వాటిని మంజూరు చేయకుండా ఇప్పటికే ఉన్న ఎస్‌జీటీ పోస్టులను ప్రధానోపాధ్యాయులుగా ఉన్నతీకరించనున్నారు. ఈ కారణంగా ఎస్‌జీటీ ఖాళీలు తగ్గిపోనున్నాయి. త్వరలోనే ఈ ఉన్నతీకరణపై ప్రభుత్వం జీవో విడుదల చేస్తుంది” అని ఆయన అన్నారు.

Good news .. KCR Sarkar green flag for 5,571 posts

అనంతరం కొలువుల దస్త్రంపై సంతకం చేసిన హరీశ్‌రావుకు పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న వారికి ఉరట లభించనుంది. ఇప్పటికే తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్ అధికారులు విడుదల చేసిన విషయం తెలిసిందే. జూన్ 12న టెట్ పరీక్షను నిర్వహించే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.