ఓటీటీలో కేజీఎఫ్ ఛాప్టర్2.. చూడాలంటే డబ్బులు కట్టాలంట - MicTv.in - Telugu News
mictv telugu

ఓటీటీలో కేజీఎఫ్ ఛాప్టర్2.. చూడాలంటే డబ్బులు కట్టాలంట

May 16, 2022

డైరెక్టర్ ప్రశాంత్ నీల్, కన్నడ స్టార్ హీరో యష్ కాంబోలో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2’ రికార్డులు బద్దలుకొడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.1200 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ఇక ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ‘కేజీయఫ్‌:చాప్టర్‌2’ తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. కానీ ఈ సినిమా చూడాలనుకునే వారికి ఓ కండీషన్.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతున్న కేజీఎఫ్-2 ను చూడాలంటే ఎవరైనా అదనంగా రూ.199 చెల్లించాల్సి ఉంటోంది. మీకు ఒకవేళ అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌ స్క్రిప్షన్‌ ఉన్నా సరే.. రూ.199 చెల్లించాల్సిందే. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే… మీరు చెల్లించిన రూ.199 కి కేవలం 30 రోజుల పాటు వ్యాలిడిటీ మాత్రమే ఉంటుంది. ఇంకేం 30 రోజులు హ్యాపీగా బోర్ కొట్టేంతవరకూ సినిమాని చూసేయొచ్చని అనుకుంటున్నారా..? దానికి కూడా ఓ కండీషన్. ఏంటంటే సినిమాను మీరు చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో మీ గడువు పూర్తయిపోతుంది. అంటే ‘కేజీయఫ్‌2’ అద్దెకు తీసుకుని, చూడటం మొదలు పెడితే 48 గంటల్లో చూసేయాలన్నమాట. తప్పదు మరి.. సినిమాను చూడాలంటే ఈ కండీషన్లన్నీ ఫాలో అవ్వాల్సిందే.