Good news..Laptop for Rs.15 thousand: Reliance
mictv telugu

గుడ్‌న్యూస్..రూ.15 వేలకే ల్యాప్‌టాప్: రిలయన్స్‌

October 3, 2022

భారతదేశంలో రిలయన్స్‌ జియోకి ఎంతమంది వినియోగదారులు ఉన్నారే మాటల్లో చెప్పలేము. ఇప్పటికే 4జీ ఇంటర్నెట్‌‌ సేవలతో జియో సంచలన సృష్టించింది. మరోసారి జియో ల్యాప్‌టాప్‌‌తో సంచలనం సృష్టించేందుకు సిద్దమైంది.  అతి త్వరలోనే దేశ ప్రజలకు, యువతకు, విద్యార్థులకు గుడ్‌న్యూస్‌తో ముందుకురాబోతుంది. ఇటీవలే జియో సంస్థ నుంచి అతి తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లను విడుదల చేస్తామని అధినేత ముఖేశ్‌ అంబానీ ప్రకటించిన మాటను నిలబెట్టుకొబోతున్నారు. కేవలం రూ.15 వేల (184 డాలర్లు) ధరకే ల్యాప్‌‌టాప్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు టెక్ వర్గాలు తెలియజేశాయి.

టెక్‌ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం..”జియో ల్యాప్‌టాప్‌ల కోసం రిలయన్స్‌ సంస్థ ఇప్పటికే మైక్రో ప్రాసెసర్‌‌ల తయారీ సంస్థ క్వాల్‌ కమ్‌, ఆపరేటింగ్‌ సిస్టం కోసం మైక్రోసాఫ్ట్‌ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టంలో అవసరానికి అనుగుణంగా ప్రత్యేకంగా మార్పులు చేసిన ‘జియో ఆపరేటింగ్‌ సిస్టం’తోపాటు జియోకు సంబంధించిన కొన్ని యాప్స్‌‌ను, ఇతర సదుపాయాలను జియో ల్యాప్‌‌టాప్‌లో ముందే ఇన్‌‌స్టాల్‌ చేసి అందించనుంది. అదనంగా అవసరమైన యాప్స్‌ను జియో స్టోర్‌ నుంచి డౌన్‌‌లోడ్‌ చేసుకుని, ఇన్‌‌స్టాల్‌ చేసుకోవచ్చు” అని తెలిపాయి. అయితే ఈ ల్యాప్‌‌టాప్‌ ధర, ప్రత్యేకతలపై స్పందించేందుకు జియో వర్గాలు నిరాకరించాయి.

మరోపక్క దేశవ్యాప్తంగా ప్రస్తుతం జియోకు 42 కోట్ల మంది టెలికం వినియోగదారులు ఉన్నారని, ల్యాప్‌టాప్‌‌ల రాకతో జియో మార్కెట్‌ మరింతగా విస్తరిస్తుందని మార్కెట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జియో ఈ నెలలోనే జియోబుక్‌ ల్యాప్‌‌టాప్‌‌లను విడుదల చేసే అవకాశం ఉందని, మొదట స్కూళ్లు, ప్రభుత్వ విద్యాసంస్థల విద్యార్థులకు అందజేయనున్నారని టెక్‌ వర్గాలు వివరాలను తెలియజేశాయి. అయితే, ఈ ల్యాప్‌టాప్‌‌లు మరో రెండు, మూడు నెలల్లో బహిరంగ మార్కెట్లోకి రావొచ్చని విళ్లేషకులు అంచనా వేస్తున్నారు.