Good news..'Luna' cart is coming again
mictv telugu

గుడ్‌న్యూస్..’లూనా’ బండి మళ్లీ వచ్చేస్తోంది

September 9, 2022

భారతదేశంలో నెటిక్ లూనా మోపెడ్ కంపెనీ 1972వ సంవత్సరంలో ‘లూనా’ బండిని మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పటి నుంచి 2000ల సంవత్సరం వరకు తన కార్యకలపాలను సాగించింది. ఆ తర్వాత ఆధునిక టెక్నాలజీలతో మార్కెట్లోకి కొత్త కొత్త ద్విచక్ర వాహనాలు విడుదల అవడంతో, లూనా విక్రయాలు తగ్గిపోయాయి. దాంతో మోపెడ్ కంపెనీ పూర్తిగా లూనా బండ్లను నిలిపివేసింది. ఆ తర్వాత మళ్లీ తమ కంపెనీ తయారు చేసిన బండ్లను మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయి? అనే విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దాంతో లూనా బండిని కొననాలి ఎదురుచూసిన వారికి తీవ్ర నిరాశ మిగిలింది.

తాజాగా కైనెటిక్ గ్రూపు ఫౌండర్ సులజ్జా ఫిరోడియా మోత్వానీ మీడియాతో మాట్లాడారు. మళ్లీ లూనా బండ్లను అతి త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తున్నామని, త్వరలోనే తమ కంపెనీ బండ్లు మళ్లీ రోడ్డెక్కనున్నాయని తెలియజేసింది. కాకపోతే ఈ సారి ఎలక్ట్రిక్ వాహనంగా లూనా రానుందని పేర్కొంది.

”కైనెటిక్ గ్రీన్ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23)లో మొత్తం 50 వేల ద్విచక్ర వాహనాలు, 10 వేల త్రిచక్ర వాహనాలను విక్రయించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. చైనాకు చెందిన ఏఐఎంఏ టెక్నాలజీ గ్రూపుతో కలసి ద్విచక్ర వాహన మార్కెట్లోకి తీసుకు రావాలని అనుకుంటున్నాం. 2023 ఆరంభంలో ఏటా 3 లక్షల వాహనాలను తయారు చేయగల కొత్త ప్లాంట్‌ను సంస్థ ప్రారంభించనుంది. నవంబర్ నెలలో ఎలక్ట్రిక్ లూనాను మార్కెట్లోకి విడుదల చేస్తాం. ఏఐఎంఏ టెక్నాలజీ సాయంతో ఈ-స్కూటర్లను ప్రవేశపెట్టనున్నాం” అని సులజ్జా ఫిరోడియా అన్నారు.