Good news..Notice released for 1,411 constable posts
mictv telugu

గుడ్‌న్యూస్..1,411 కానిస్టేబుల్ పోస్టులకు ప్రకటన విడుదల

July 13, 2022

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఓ శుభవార్తను చెప్పింది. పోలీస్ విభాగంలో ఖాళీగా ఉన్న 1,411 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులకు ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారు అర్హులని తెలిపింది. ఈ ఉద్యోగాలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్యం , కొలతల పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేస్తామని పేర్కొంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఓ ప్రకటనలో వివరించింది.

”మొత్తం ఖాళీలు 1,411, ఇందులో ఓపెన్ 604, ఓబీసీ 353, ఈడబ్ల్యుఎస్ 142, ఎస్సీ 262, ఎస్టీ 50 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులే మాత్రమే అర్హులు. జులై 1, 2022 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల మినహాయింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్ససర్వీసమెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగిలినవారు రూ. 100 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. కావున అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ http://www.delhi police.nic.in/లో దరఖాస్తులు చేసుకోవాలి” అని ప్రకటనలో పేర్కొన్నారు.