దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో మధుమేహంతో బాధపడుతున్న వారికి జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (ఎన్పీపీఏ) ఓ గుడ్న్యూస్ చెప్పింది. మధుమేహంతోపాటు వివిధ రకాల వ్యాధుల చికిత్సకు వినియోగించే 45 రకాల ఔషధాల రిటైల్ ధరలను సవరిస్తూ, తాజాగా ఎన్పీపీఏ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఉత్తర్వులో..”మధుమేహ మందులతోపాటు రక్తపోటు, సాధారణ జలుబు, ఇన్ఫెక్షన్లు, కంటికి సంబంధించినవి. అధిక కొలెస్ట్రాల్, టైగ్లిసరైడ్ స్థాయిల చికిత్సకు వినియోగించే ఔషధాలు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చికిత్సలో వినియోగించే సిటాగ్లి పిన్+మెట్ఫర్మిన్ హైడ్రోక్లోరైడ్, లినాగ్లిష్టిన్+మెట్ఫామిన్ కాంబినేషన్ల ఔషధాలు. ఒక్కో ట్యాబ్లెట్ ధరను..వరుసగా రూ.16-21, రూ.16-25 శ్రేణికి తీసుకువచ్చింది”.
ఇక, సిటాగ్లిషిపై ‘మెర్క్ షార్స్ అండ్ డోమ్ (ఎంఎస్టీ)’ పేటెంట్ హక్కులు గత నెలతో ముగిసింది. అదేవిధంగా లినార్లెషిన్+మెట్ ఫామిన్పై ఉన్న పేటెంట్ హక్కుల కాలపరిమితి కూడా వచ్చే నెలలో ముగియనుంది. ఈ క్రమంలో ఈ మాత్రల ధరలను ఎన్పీపీఏ తగ్గించింది. అలాగే, అలర్జీ, జలుబు వంటి వాటికి వినియోగించే పారాసెటమాల్, పినైల్ ఫైన్, హైడోక్లోరైడ్, కెఫైన్ అండ్ డిఫెన్ హై డ్రామెన్ హైడ్రోక్లోరైడ్ కాంబినేషన్ ఔషధం ధరను రూ.3.78గా నిర్ణయించింది. యాంటీబయాటిక్గా ఉపయోగించే అమోక్సిసిలిన్ అండ్ పొటాషియం క్లావులనేట్ ఓరల్ సస్పెన్షన్ సిరప్ ధరను రూ.168.43గా స్థిరీకరించింది. డ్రగ్ పైస్ కంట్రోల్ ఆర్డర్-2013 ప్రకారం తాజా ధరలను నిర్ణయించినట్టు ఎస్పీపీఏ ఉత్తర్వులో పేర్కొంది.