Good news..PhD with a four-year degree
mictv telugu

గుడ్‌న్యూస్..నాలుగేండ్ల డిగ్రీతోనే పీహెచ్‌డీ

September 29, 2022

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విద్యార్ధినీ, విద్యార్థులకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ఉన్నత విద్యలో మరో కీలక సంస్కరణను తీసుకురావడానికి ఓ కీలక నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇకపై పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)తో సంబంధం లేకుండా నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) చేసినవారు..నేరుగా పీహెచ్‌డీలోకి చేరే అవకాశాన్ని కల్పించబోతున్నామని తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను అతి త్వరలోనే విడుదల చేస్తామని తెలియజేసింది.

”ఈ నిర్ణయం అమలులోకి వస్తే..బీఈ, బీటెక్, ఆనర్స్ డిగ్రీ, బీఫార్మసీ, ఫార్మా – డీ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరొచ్చు. అయితే, సంవత్సరం పీహెచ్‌డీ ప్రవేశాలు విద్యారులు నాలుగేండ్లు లేదా ఎనిమిది సెమిస్టర్లు ఉన్న కోర్సులో 75 శాతానికిపైగా మార్కులు పొంది ఉండాలి. నాలుగేండ్ల డిగ్రీ పూర్తిచేసిన తర్వాత ఏడాది, రెండు సెమిస్టర్ల వ్యవధి ఉన్న మాస్టర్స్ కోర్సును పూర్తిచేసిన వారు కూడా పీహెచ్‌డీలో చేరవచ్చు” అని యూజీసీ వర్గాలు వెలడించాయి.

అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడేండ్లు డిగ్రీ, ఆ తర్వాత పీజీ కోర్సు చదివాక పీహెచ్‌డీ కోర్సుల్లో చేరే అవకాశం ఉంది. ముందుగా జేఆర్ఎఫ్, గెట్, సీడ్, నెట్, సెట్ అర్హతతోపాటు, వర్సిటీలు ప్రవేశ పరీక్షలను నిర్వహించి, పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.