గుడ్‌న్యూస్..రూ.7 వేలకే రియల్‌మీ స్మార్ట్ ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్..రూ.7 వేలకే రియల్‌మీ స్మార్ట్ ఫోన్

June 21, 2022

ఫోన్ ప్రియులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. తమ కంపెనీ తాజాగా తయారు చేసిన కొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేశామని పేర్కొంది. సామాన్యులు సైతం స్మార్ట్ ఫోన్‌ను కోనుగోలు చేసేలా ధరను నిర్ణయించామని తెలిపారు. ఫీచర్ల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని వివరాలను వెల్లడించారు.

”రూ. 7000 ప్రారంభ ధరతో లభిస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ 6.6 ఇంచులు ఉంటుంది. ఫుల్‌హెచ్‌డీ + డిస్‌ప్లేను అందించారు. వాటర్‌ డ్రాఫ్-స్టైల్ నాచ్ డిస్‌ప్లే ఉంటుంది. అక్టాకోర్ Unisoc T612 Soc ప్రాసెసర్‌లో పనిచేసేలా 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 13 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 2 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజ్, 3 జీబీ ర్యామ్ +32 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో విడుదల చేశారు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 7వేలుగా ఉంది.” అని కంపెనీ యాజమాన్యం పేర్కొంది.