గుడ్‌న్యూస్.. తగ్గిన మందుల ధరలు - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. తగ్గిన మందుల ధరలు

July 6, 2022

జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్, గుండెపోటు, పక్షవాతం, నొప్పి వంటి నివారణలకు ఔషధాలను వాడుతున్న వారికి శుభవార్తను చెప్పింది. 30-40 శాతం వరకు మందుల ధరలను తగ్గిస్తూ, మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు సవరించిన ధరలకే మందులను అమ్మాలని ఉత్పత్తి సంస్థలను ఎస్పీప్పీ ఆదేశించింది. ఇవే ఔషధాలను వేర్వేరు ఫార్ములాలతో కొత్తగా మార్కెట్లోకి తేవాలనుకుంటే ప్రభుత్వ అనుమతిని తప్పనిసరిగా పొందాలని తెలిపింది.

ధరలు సవరించిన మందులు ఇవే..

అటోర్వాసాటిన్, ఫెనో ఫైబ్రేట్ మాత్ర ధర ఒక్కోటి రూ. 13, 87గా నిర్ణయించింది. ఈ మందులను గుండె, మధుమేహ రోగులు వినియోస్తారు. ‘ఒల్మెసార్దన్ ప్లస్ మెడోస్సోమిల్ ప్లస్ అమోడి పైన్ ప్లస్ హైడ్రోక్లోరోథియాటై’ ఒక్కో మాత్రకు రూ.12,91గా స్థిరీకరించింది. వాగ్లిబోస్ అండ్ (ఎస్ఆర్) మెట్ఫార్మన్ హైడ్రోక్లోరైడ్ ఒక్కో మాత్ర ధర రూ. 10. 47గా నిర్ణయించింది. పారాసిటమాల్, కెఫెన్ ధరను ఒక్కో మాత్రకు రూ.2.88గా నిర్ణయించింది. రోసువాస్టాటిన్ ఆస్పిరిన్, క్లోపిడో గ్రిల్ క్యాప్సూల్ ధరను ఒక్కో దానికి రూ. 13, 91గా, పారాసిటమాల్, ఐబూప్రొఫెన్ సస్పెన్షన్ ధరను ఒక్కో మిల్లీలీటరు(ఎంఎల్)కు రూ. 0.33గా నిర్ణయించింది.

ఇక, శ్వాసకోశ, ఇతర ఇన్‌ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్‌గా వినియోగించే ‘అమోక్సిసిలిన్ అండ్ పొటాషియం క్లావులనేట్ ఐపీ’ ఒక్కో మాత్ర ధర రూ. 34.08గా పేర్కొంది. ఇదే కాంబినేషన్లో ఓరల్ సస్పెన్షన్‌కు ఒక్కో ఎంఎలకు రూ. 3,90గా ధరను స్థిరీకరించింది. రక్తహీనతను తగ్గించడానికి వినియోగించే ఫెర్రస్ అస్కార్ట్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఓరల్ డ్రాప్స్ గరిష్ఠ చిల్లర ధరను ఒక్కో ఎంఎల్ కు రూ.5.00గా, నొప్పి, వాపులు తగ్గించడానికి వినియోగించే అసెక్లోఫెనాక్ అండ్ పారాసిటమాల్, ట్రిప్సిన్, క్రిమోట్రిప్సిన్ కాంబినేషన్‌లో వచ్చిన మందు ఒక్కో మాత్ర ధర రూ.13.85గా స్థిరీకరించింది. కోపిడొర్రెల్ అండ్ ఆస్పిరిన్ మాత్రలను గుండెజబ్బులు, మధుమేహ రోగులు వినియోగిస్తారు. ఈ మాత్ర ధర ఒక్కో దానికి రూ.4.34గా నిర్ణయించింది.వీటితో మరికొన్ని మందులను ధరలను జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ తగ్గించింది.