రష్యా, ఉక్రెయిన్ దేశాల యుద్ధం కారణంగా భారత్‌లో వంటనూనెల ధరలతోపాటు నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. దాంతో సామాన్య ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో దేశ ప్రజలకు ప్రముఖ చమురు సంస్థ ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఫ్రీడమ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ధరను రూ. 20 తగ్గిస్తూ, ఓ ప్రకటన విడుదల చేసింది.
‘ఇక నుంచి లీటర్ నూనె గరిష్ఠ ధర (ఎంఆర్‌పీ) రూ.200. ప్రస్తుతం స్టోర్లలో రూ.220 స్టాకు ఉంది. మరికొద్ది వారాల్లో తగ్గించిన ధరలతో పూర్తి స్టాక్‌ను అందుబాటులోకి తీసుకొస్తాం.’ అని సన్ ఫ్లవర్ తెలిపింది. ఇటీవలే ఫ్రీడమ్ ఆయిల్‌పై రూ.15 తగ్గించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రూ.20 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.