గుడ్‌న్యూస్.. కార్మికశాఖలో నోటిఫికేష్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. కార్మికశాఖలో నోటిఫికేష్ విడుదల

June 16, 2022

కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న యంగ్‌ ప్రొఫెషన్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి అధికారులు పూర్తి సమాచారాన్ని ఇటీవలే విడుదల చేశారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? అర్హతలు ఏంటీ? దరఖాస్తులు చివరి తేదీ ఎప్పుడు? అనే పూర్తి వివరాలు మీకోసం..

” మొత్తం 130 పోస్టుల ఉన్నాయి. ఆన్‌లైన్‌ అప్లికేషన్లు ఈ నెల 22 వరకు అందుబాటులో ఉంటాయి. ఆసక్తికలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు బీఏ, బీఈ, బీటెక్‌, బీఈడీలో ఏదో ఒకటి చేని నాలుగేండ్ల అనుభవం ఉండాలి. లేదా ఎంబీఏ, పీజీలో ఎకనామిక్స్‌, సైకాలజీ, సోషియాలజీలో ఏదైనా చేసి రెండేండ్లపాటు పనిచేసిన అనువభవం వారు అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు 20 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. రెండేండ్ల కాలపరిమితికి కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. దానిని మరో మూడేండ్ల వరకు పొడిగించే అవకాశం ఉంటుంది. వెబ్‌సైట్‌: www.ncs.gov.in”