భారత్‌లో టెక్నాలజీ క్రమ క్రమంగా అభివృద్ది చెందుతోంది. 2జీ మొబైల్ నుంచి 5జీ మొబైల్ వరకు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మొబైల్ కంపెనీలు తీపికబురు చెప్పాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి రూ. 10 వేలకే 5జీ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే మొబైల్ సంస్థలు, అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు కోసం ఆయా కంపెనీలు కలిసి పని చేస్తున్నాయి అని పరిశ్రమ అధికారులు తెలిపారు.
సామాన్యులకు సైతం 5జీ సేవల్ని అందించే యోచనలో టెలికాం కంపెనీలు ముందుకు వెళ్తున్నట్లు, అందుబాటు ధరలోనే 5జీ ఫోన్లను తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ”భారత్ వంటి దేశాల్లో కొత్త చిప్‌సెట్‌ను ప్రవేశపెడతాం. ప్రస్తుతం 5జీ ప్రాసెసర్‌తో వస్తోన్న స్నాప్ డ్రాగన్ 480 చిప్సెట్తో పోలిస్తే, దాని ధర తక్కువగా ఉంటుంది. తైవాన్‌కు చెందిన మీడియాటెక్, చైనా కంపెనీ యూనిసాక్ సైతం అందుబాటు ధరలో చిప్సెట్లను అందించేందుకు ముందుకు వచ్చాయి. 5జీ ఫోన్ల ధర రూ. 15,000గా ఉండేది. అది క్రమంగా రూ.12,999 పడిపోయింది. ఈ ఏడాది చివరికి అది మరింత తగ్గి రూ.12,000 దిగొచ్చే అవకాశం ఉంది. త్వరలోనే రూ.10 వేలకే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది” అని మొబైల్ తయారీ సంస్థ ఉన్నతాధికారి తెలిపారు.