దేశ ప్రజలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో శుభవార్తను చెప్పాయి. ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ, బుధవారం ప్రకటన విడుదల చేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్‌పై ఏకంగా రూ.135 తగ్గిస్తున్నట్లు తెలిపాయి. తగ్గిన ధరలు నేటీ నుంచే అమలులోకి వస్తాయని పేర్కొన్నాయి.
ఇటీవలే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను మే 19వ తేదీన చివరిసారిగా పెంచిన విషయం తెలిసిందే. బుధవారం పెంచిన ధరలను తగ్గిస్తూ, రేట్ల పట్టికను ప్రకటించాయి. కానీ, ఈ కొత్త రేట్లలో డొమెస్టిక్ సిలిండర్ ధరను మాత్రం మార్చలేదు. దేశవ్యాప్తంగా ఈ కమర్షియల్ సిలిండర్ ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 2354గా ఉంది. ఇప్పుడు రూ. 2219కు లభిస్తోంది. కోల్‌కతాలో ఈ సిలిండర్ ధర రూ. 2454 నుంచి రూ. 2322కు దిగి వచ్చింది. ముంబైలో ఈ సిలిండర్ ధర రూ. 2117గా ఉంది. చెన్నైలో ఈ సిలిండర్ ధర రూ. 2507 నుంచి రూ. 2373కు తగ్గింది. ఇక, హైదరాబాద్‌లో ఈ సిలిండర్ ధర రూ. 2425గా ఉంది.
మరోపక్క 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏప్రిల్ నెలలో ఏకంగా రూ. 250 పెరిగింది. ఆ తర్వాత మార్చి నెలలో రూ. 105కి కదిలింది. డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ ధర తెలుగు రాష్ట్రాల్లో రూ. 1050కు పైనే ఉంది. కాగా, గత నెలలో ఎల్పీజీ సిలిండర్ ధరలు రెండు సార్లు పెరగింది. ఈ క్రమంలో ధరలను తగ్గిస్తూ, ప్రకటన విడుదల చేయడంతో ఎల్పీజీ కమర్షియల్ గ్యాస్‌ను వినియోగిస్తున్న వినియోగాదారులకు ఊరట లభించింది.