Good news.. Rs.36 discount on commercial gas
mictv telugu

గుడ్‌న్యూస్.. కమర్షియల్ గ్యాస్‌పై రూ.36 తగ్గింపు

August 2, 2022

దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై రూ.36 తగ్గిస్తూ, చమురు సంస్థలు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. అంతేకాదు, తగ్గించిన ఈ ధర వెంటనే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,976కు చేరింది.

అయితే, కోల్‌కతాలో ఈ సిలిండర్ ధర రూ. .2095.50గా ఉండేది. ప్రస్తుతం 2012.50కి చేరింది. ముంబైలో రూ.2021గా ఉండేది. ప్రస్తుతం 1936.50కు చేరింది. కానీ, 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, తినుబండారాలు, టీ స్టాల్స్, 19 కిలోల సిలిండర్లలో అతిపెద్ద వినియోగదారు సెగ్మెంట్‌‌గా ఉన్న ఇతరులకు కొంత ఉపశమనం కలిగిస్తుంది. మరోవైపు విమాన ఇంధన ధర 12 శాతం తగ్గింది.