Good news..'RX 100' is coming again
mictv telugu

గుడ్‌న్యూస్..’ఆర్ఎక్స్ 100’మళ్లీ వచ్చేస్తోంది

July 21, 2022

దేశవ్యాప్తంగా మార్కెట్లోకి కొత్త కొత్త ఫీచర్స్‌తో రోజుకో బైక్‌ విడుదల అవుతున్న ‘ఆర్ఎక్స్ 100’ బైక్ ఉంటే ఆ కిక్కే వేరప్ప అనేవాళ్లు ఇప్పటికే చాలామందే ఉన్నారు. ఎందుకంటే ఆ బైక్ సౌండ్‌ కోసమైన ప్రతివారు దానిని కొనాలని, ఆ బైక్‌ను నడపాలని మనసులో ఒక్కసారైనా అనుకుంటారు. కానీ, కొన్ని దశాబ్దాలుగా యువతను అలరించిన ఆర్ఎక్స్ 100 బైక్‌ను కొన్ని సాంకేతిక, 2 స్ట్రోక్ ఇంజిన్ కారణాల వల్ల కొన్ని ఏళ్లపాటు కంపెనీ నిలిపివేసింది. దాంతో యువత చాలా నిరాశ చెందారు. మళ్లీ ఆర్ఎక్స్ 100 మార్కెట్లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న ఆర్ఎక్స్ 100 బైక్ ప్రియులకు యమహా కంపెనీ యాజమాన్యం శుభవార్తను చెప్పింది. మళ్లీ ఆర్ఎక్స్ 100ను మార్కెట్లోకి తీసుకొస్తామని ప్రకటించింది.

”యమహా కంపెనీ..ఆర్ఎక్స్100 ప్రేమికులకు శుభవార్త. ఈ బైక్‌ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తెస్తున్నాం. సరికొత్త రూపులో ఆర్ఎక్స్100ను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాం. కానీ, గతంలో ఉన్న 2 స్ట్రోక్ ఇంజిన్ ఇప్పటి ఉద్గారాల ప్రమాణాల నిబంధనల వల్ల ఇవ్వడం కుదరదు” అని ‘అని యమహా మోటార్ ఇండియా విభాగం చైర్మన్ ఇషిన్ చిహానా వెల్లడించారు.

యమహా-ఎస్కార్ట్స్ గ్రూపు భాగస్వామ్యంలో 1985 నుంచి ఉత్పత్తి చేస్తున్న ఈ బైక్‌ను 1996 వరకు కొనసాగించారు. తదనంతర కాలంలో ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో కుర్రకారు ఇతర బైక్‌ల వైపు మళ్లారు. ఆర్ఎక్స్ 100ను జపాన్‌కు చెందిన యమహా కంపెనీ తయారు చేసిన విషయం తెలిసిందే. ఎంతో స్టయిలిష్ లుక్‌తో ఉండే ఈ బైక్‌ను కాలేజీ కుర్రకారు అమితంగా ఇష్టపడేవారు.