గుడ్‌న్యూస్.. వంటనూనెలపై సుంకం తొలగింపు - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. వంటనూనెలపై సుంకం తొలగింపు

May 25, 2022

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. వంట నూనెలపై ధరలను తగ్గించాలని నిర్ణయించినట్లు మంగళవారం ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. 20 లక్షల మెట్రిక్ టన్నుల పొద్దు తిరుగుడు పువ్వు (సన్ ప్లవర్) నూనె, 20 లక్షల మెట్రిక్ టన్నుల సోయాబీన్ నూనెల దిగుమతిపై కస్టమ్స్ సుంకం, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌లను తొలగిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. 2022-23, 2023-24 ఆర్ధిక సంవత్సరాల్లో ముడి సోయాబీన్ నూనె, ముడి పొద్దు తిరుగుడు పువ్వు నూనెల దిగుమతికి ఈ మినహాయింపు వర్తిస్తుంది పేర్కొంది.

ఈ ప్రకటనతో దేశీయంగా వంటనూనెల ధరలు భారీగా తగ్గి, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ”దిగుమతుల కోటా కోసం మే 27 నుంచి జూన్ 18 లోపు సంస్థలు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దాదాపు లీటరు నూనెపై రూ. 8 తగ్గుతుంది. ప్రస్తుతం వంటనూనెలపై కస్టమ్స్ సుంకంతోపాటు వ్యవసాయ అభివృద్ధి సెస్‌ల పేరిట 5.5% వసూలు చేస్తున్నాం. ఇది అమలు అయితే గనుక సోయాబీన్ నూనె ధర లీటరుకు రూ.2 తగ్గుతుంది” అని అధికారులు తెలిపారు.