Good news..The first KG to PG school is ready...here are the photos
mictv telugu

గుడ్‌న్యూస్..తొలి కేజీ టూ పీజీ విద్యాల‌యం రెడీ…ఇవిగో ఫొటోలు

August 11, 2022

Good news..The first KG to PG school is ready...here are the photos

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కాసేపటిక్రితమే ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్ర‌త్యేక రాష్ట్రం ఆవిర్భ‌వించిన తర్వాత కేసీఆర్..రాష్ట్ర విద్యా వ్య‌వ‌స్థ‌లో నూత‌న విధానాల‌ను అమ‌లు చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను, ఇంటర్ కాలేజీలను, డిగ్రీ, పీజీ, వర్సిటీలను అభివృద్ది చేయటం కోసం కొన్ని కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారు. ఇందులో భాగంగా కేసీఆర్..తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్యాలయాన్ని త్వరలోనే నిర్మిస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆరోజు ప్రకటించిన మాటను కేసీఆర్ సర్కార్ నిజం చేస్తూ, తెలంగాణలోని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా ప‌రిధిలోని గంభీరావుపేట‌లో ఏర్పాటైన తొలి కేజీ టూ పీజీ ఉచిత విద్యాలయానికి సంబంధించిన కొన్ని ఫోటోలను అధికారులు ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ కేజీ (కిండ‌ర్ గార్టెన్‌) టూ పీజీ (పోస్ట్ గ్రాడ్యుయేష‌న్‌) ద్వారా విద్యార్థులు ఒకే చోట తమ విద్యను పూర్తి చేసుకునేలా ఈ నూత‌న విద్యాల‌యాల‌ను ఏర్పాటు చేశారు.

ఈ విద్యాల‌యంలో.. వ‌సతులు, భ‌వ‌న నిర్మాణం త‌దిత‌ర వివరాలను వెల్ల‌డిస్తూ, తెలంగాణ రెనూవ‌బుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ స‌తీశ్‌ రెడ్డి గురువారం ఓ ట్వీట్ చేశారు. ఆ ట్విట్‌లో ఉన్న ఫోటోలలో విద్యాలయంలో ఉన్న కుర్చీలు, గ్రౌండ్, గదులు, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో, రాత్రివేళలో లైటింగ్ వంటి ఫోటోలు ఉన్నాయి.