బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా పసిడి రేటు పడిపోయింది. జూలై 15న బంగారం ధర రూ. 430 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ. 50,730కు క్షీణించింది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర విషయానికి వస్తే.. ఈ గోల్డ్ రేటు కూడా రూ. 400 తగ్గింది. 10 గ్రాములకు రూ. 46,500కు దిగివచ్చింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 గా ఉంది.
అలాగే వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ ధర కూడా దిగి వచ్చింది. ఏకంగా రూ. 800 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ. 60,400కు పడిపోయింది. సిల్వర్ రేటు నిన్న కూడా తగ్గింది. రూ. 500 పడిపోయింది. దీంతో సిల్వర్ రేటు కేవలం రెండు రోజుల్లోనే రూ. 1300 పతనమైందని చెప్పుకోవచ్చు. దీంతో వెండి పట్టీలు, కడియాలు, ఇతర వెండి ఆభరణాలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం.