good news to train passengers indian railways reduces fare ac3 tier economy class
mictv telugu

ప్రయాణికులకు రైల్వే ఖుషీ ఖబర్…ఏసీ ప్రయాణం మరింత చౌక

March 23, 2023

 

ఈ ఏడు వేసవి కాలంలో ఎండలు ఇరగదీస్తున్నాయి. సూర్యుడి ప్రతాపాన్ని సామాన్యులు తాలలేకపోతున్నారు. ఉదయం 9 దాటితే భగభగమండే భానుడి ప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతువన్నారు. ఈ ఏడు వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ఖుషీ ఖబర్‏ను తీసుకువచ్చింది. వేసవి వేల ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించి ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలను తగ్గించింది. ప్రయాణికులకు మరింత చౌకగా ధరలు ఉండేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

తాజా నిర్ణయంతో సామాన్యులు కూడా ఇకపై ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది. నవంబర్ 2022లో పెంచిన ధరలను రైల్వే శాఖ ఉపసంహరించుని, ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ల కొత్త ధరలను అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో ఉన్న మాదిరిగానే టిక్కెట్ ధరలు ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఆన్‏లైన్‏లో , వ్యక్తిగతంగా టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు అదనపు డబ్బును తిరిగి చెల్లించనున్నారు.

రైల్వే శాఖ ఏసీ 3 టైర్ ఎకానమీ కోచ్ లను సెప్టెంబర్ 2021లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 463 ఏసీ 3 ఎకానమీ కోచ్ లు ఉన్నాయి. ఏసీ3 కంటే ఏసీ 3 ఎకానమీ కోచ్ లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అందుకే ఈ ఏసీ 3 ఎకానమీ కోచ్ లు ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలోనే భారతీయ రైల్వే శాఖ రూ.231 కోట్లను ఆర్జించింది.