గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఒకేసారి రెండు డిగ్రీలు - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. ఇకనుంచి ఒకేసారి రెండు డిగ్రీలు

April 12, 2022

gngn

దేశవ్యాప్తంగా ఒకే కాలంలో రెండు డిగ్రీలు చదవాలని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా కొత్త మార్గదర్శకాలతో ముందుకు వస్తున్నట్లు మంగళవారం తెలిపింది. యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ మాట్లాడుతూ.. ఇకనుంచి ఒకేసారి రెండు డిగ్రీలు చేవొచ్చు. అది కూడా ఫిజికల్ మోడ్‌లో వేర్వేరు వర్సిటీల నుంచి రెండు డిగ్రీలు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి కమిషన్ త్వరలో వివరణాత్మకంగా మార్గదర్శకాలు జారీ చేస్తుంది” అని ఆయన అన్నారు.

మరోపక్క ప్రస్తుతం డిగ్రీని అభ్యసిస్తున్న విద్యార్థులు ఒకే టైంలో రెండు రెగ్యులర్ డిగ్రీలు చేయాలంటే సాధ్యమైన పని కాదు. అలా చేయడానికి కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని అవకాశాలు ఇవ్వలేదని అందరికీ తెలుసు. కానీ, ఒకవైపు రెగ్యులర్‌ డిగ్రీని చేస్తూ, డిస్టెన్స్ (దూరవిద్య)లో మరో డిగ్రీని చేసేందుకు అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ ఒకే సమయంలో రెండు డిగ్రీలను అభ్యసించే విధానాన్ని తీసుకొచ్చామని తీపికబురు చెప్పారు. దీంతో రెండు డిగ్రీలు చేయాలని ఎదురుచూస్తున్న విద్యార్థులకు వారి ఆశ నేరవేరనుంది.