Good news. Two more medical colleges are allowed..in this district
mictv telugu

గుడ్‌న్యూస్..మరో రెండు మెడికల్‌ కాలేజీలకు అనుమతి..ఈ జిల్లాలోనే

August 12, 2022

తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో రెండు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి గతంలో నేషనల్ మెడికల్ కమిషన్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ రెండు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తైంది. దీంతో ఒక్కో కాలేజీలో 150 సీట్లకు అనుమతులు ఇస్తూ, నేషనల్ మెడికల్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అవి కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే భర్తీ చేసి, తరగతులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది.

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..”ఇప్పటికే రెండు జిల్లాల్లోను మెడికల్ కాలేజీల భవనాలు పూర్తయ్యాయి. వనపర్తిలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయటం ఎంతో హర్షించదగ్గ విషయం. కేసీఆర్‌కు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు, జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు. కాలేజీకి అవసరమైన మౌలిక సౌకర్యాలు, లాబొరేటరీ, లైబ్రరీ, హాస్టల్స్, సౌకర్యాలు, ఫ్యాకల్టీ, అనుభవం, పబ్లికేషన్స్, నర్సింగ్ అండ్ పారా మెడికల్ సిబ్బంది వంటి సౌకర్యాలను ది మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (ఎంఏఆర్‌బీ) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది.” అని ఆయన అన్నారు.

మరోపక్క కేసీఆర్‌కు..రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూమార్, ఇంద్రకరణ్ రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లాలో, నిర్మల్ జిల్లాలో కొత్తగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడానికి ఉత్తర్వులు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేస్తూ, గురువారం సాయంత్రం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి పువ్వాడకు మెడికల్ కాలేజీ మంజూరుకు సంబంధించిన ఉత్తర్వు కాపీని కేసీఆర్ అందజే శారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెడికల్ కాలేజీని కేసీఆర్ కానుకగా ఇచ్చారని మంత్రి పువ్వాడ అన్నారు.