Good news..web registration for new ration cards
mictv telugu

గుడ్‌న్యూస్..కొత్త రేషన్‌ కార్డులకు వెబ్ రిజిస్ట్రేషన్

August 6, 2022

దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఇల్లు లేనివారికి, అభాగ్యులకు, వలసదారులకు, కొత్తగా పెళ్లైన జంటలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. అర్హులైన అందరికి రేషన్ కార్డులను అందించేందుకు కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వ అధికారులు శుక్రవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ వెబ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఈ ప్రక్రియ ద్వారా ఇల్లు లేనివారు, అభాగ్యులు, వలసదారులు, కొత్తగా పెళ్లైన జంటలు రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు.

అంతేకాదు, ఈ నెలాఖరు నాటికి దేశంలో ఉన్న అన్నీ రాష్ట్రాల్లోనూ ఈ కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీని అమలు చేయనున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన వారిని వేగంగా గుర్తించి రేషన్ కార్డులు అందించడంలో రాష్ట్రాలకు సహకారం అందించేందుకు ఈ విధానాన్ని తీసుకొచ్చాయని తెలిపారు. వలసదారులు, ఇతర లబ్దిదారులు ఎవరిసాయమైనా తీసుకొని కామన్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీలో తమ వివరాలు నమోదు చేసుకొని రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.

అనంతరం దరఖాస్తులు చేసుకున్న ఆ పత్రాలను వెరిఫికేషన్ కోసం సంబంధిత రాష్ట్రాలకు పంపిస్తామని, వారు రేషన్ కార్డు పొందాక.. ‘వన్ నేషన్ వన్ రేషన్’ కార్డు ప్రోగ్రామ్ కింద దేశంలోని ఏ రేషన్ షాపులోనైనా ఆహారధాన్యాలు తీసుకోవచ్చని అధికారులు వివరాలను వెల్లడించారు.

అయితే, ఈ కొత్త రేషన్ కార్డులకు సంబందించిన వెబ్సైటు, దరఖాస్తు విధానం, ఆ 11రాష్ట్రాల వివరాలను అతి త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.