Good news: Wireless is coming..first here
mictv telugu

గుడ్‌న్యూస్: వైర్‌లెస్‌ కరెంట్‌ వచ్చేస్తోంది..తొలుత ఇక్కడే

September 10, 2022

ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు కొత్త కొత్త టెక్నాలజీలతో కూడిన పరికరాలు మార్కెట్లోకి విడుదలౌతున్నాయి. అసాధ్యం అనుకున్న వాటిని తయారీదారులు సాధ్యం చేసి చూయిస్తున్నారు. ఈ క్రమంలో నెట్టంట ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అతి త్వరలోనే వైర్‌లెస్ కరెంట్ రాబోతుందని, ఇకపై విద్యుత్ వైర్లు తగిలి మరణాలు తగ్గే అవకాశాలు మెండుగా ఉండబోతున్నాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. మరి ఇంతకి ఇది ఎలా సాధ్యం? కరెంట్ వైర్లు లేకుండా కరెంట్ ఎలా పాస్ అవుతుంది? అనే తదితర అనుమానాలకు స్పష్టతనిస్తూ, దక్షిణ కొరియకు చెందిన పరిశోధకులు వివరణ ఇచ్చారు.

ప్రస్తుతం మనకు వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ గురించి తెలుసు. కానీ, వైర్‌లెస్‌ కరెంటు గురించి తెలియదు. కానీ, అతి త్వరలోనే ప్రతి ఇంట్లోకి వైర్‌లెస్‌తో కూడిన కరెంట్ అందుబాటులోకి రాబోతుందని దక్షిణ కొరియా పరిశోధకులు తెలియజేశారు. తాజాగా దక్షిణ కొరియాలోని సెజాంగ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధక బృందం ఓ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది.

ఏకంగా 30 మీటర్ల దూరం దాకా ఇన్‌ఫ్రారెడ్‌ కాంతిని ఉపయోగించి, వైర్‌లెస్‌ విద్యుత్తును ప్రసరింపజేసింది. 400 మిల్లీ వాట్ల విద్యుత్తును సురక్షితంగా ప్రసరింపజేసి, ఎల్‌ఈడీ లైటును వెలిగేలా చేసింది. ట్రాన్స్‌ మిటర్‌, రిసీవర్‌ ద్వారా ఈ విద్యుత్తు సరఫరా జరిగినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే వ్యవస్థ మొత్తం పవర్‌ సేఫ్‌ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో ఎలాంటి అపాయాలు జరుగకుండా చూస్తుందని బృందం పేర్కొంది.

అంతేకాదు,అంతేకాదు, ‘ఈ సాంకేతికత ద్వారా స్మార్ట్‌ హోమ్స్‌ లేదా పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఇంటర్నెట్‌ ద్వారా పనిచేసే పరికరాలు)కు విద్యుత్తును అందించే అవకాశం ఉంటుంది. ఈ వైర్‌లెస్ కరెంట్ అనేది సెన్సార్ యొక్క విస్తృత కరెంట్ పరిధి. ఇది విద్యుత్, ప్రాథమిక సర్క్యూట్‌లను సమన్వయం చేస్తుంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సెన్సార్ 1Aగా ఇది రూపొందించబడింది. అంతర్ నిర్మిత ఓవర్‌లోడ్ రక్షణను కలిగి ఉంటుంది. కరెంట్ పూర్తి సర్క్యూట్‌లో మాత్రమే ఉంటుంది కాబట్టి, కరెంట్‌ని కొలవడానికి వైర్‌లెస్ కరెంట్ సెన్సార్ తప్పనిసరిగా ఆ సర్క్యూట్‌లో భాగం అయి ఉండాలి’ అని పరిశోధనలకు తెలిపారు. అంటే వైర్‌లెస్ కరెంట్ అందుబాటులోకి వస్తే, అపాయాలు జరగకుండా ప్రజలు సేఫ్‌గా ఉండొచ్చన్నమాట.