Good opportunity for unemployed..5008 jobs advertisement released
mictv telugu

నిరుద్యోగులకు గొప్ప అవకాశం..5008 పోస్టులకు ప్రకటన విడుదల

September 7, 2022

దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఎస్‌బీఐ శుభవార్తను చెప్పింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌గా తమ కార్యకలపాలను నిర్వహిస్తున్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఖాళీగా ఉన్న 5008 ఉద్యోగాలకు ప్రకటన విడుదలైంది. నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

”ఎస్‌బీఐ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మొత్తం 5008 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్ని జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు. ఈ పోస్టులకు ఈరోజు నుంచి ఆన్‌లైన్‌‌లో దరఖాస్తులు ప్రారంభమైయ్యాయి. అర్హత కలిగినవారు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్.. https://sbi.co.inలో ఈనెల 27 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందులో జనరల్‌ 2,143, ఈడబ్ల్యూఎస్‌ 490, ఓబీసీ 1165, ఎస్సీ 743, ఎస్టీ 467 చొప్పున ఖాళీలు ఉన్నాయి. అర్హతల విషయానికొస్తే.. డిగ్రీ పూర్తిచేసి 20 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి. అప్లికేషన్‌ ఫీజు విషయానికొస్తే.. రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని నిరుద్యోగులు కూడా ఆప్లై చేసుకోవచ్చు.”