Home > విద్య & ఉద్యోగాలు > మహిళలకు కేసీఆర్ తీపికబురు..181 ఈవో ఉద్యోగాలకు ప్రకటన

మహిళలకు కేసీఆర్ తీపికబురు..181 ఈవో ఉద్యోగాలకు ప్రకటన

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతకొన్ని నెలలుగా ఆయా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో గ్రూప్ 1 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, వైద్య ఉద్యోగాలు, విద్యుత్ శాఖకు సంబంధించి ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల చేసింది. తాజాగా కేవలం మహిళలకు సంబంధించి, 181 ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ఈ 181 ఉద్యోగాలు ఏ శాఖకు సంబంధించినవి? ఉద్యోగాలకు అర్హతలు ఏంటీ? దరఖాస్తులు ఎలా చేసుకోవాలి? అనే తదితర విషయాలను అధికారుల వెల్లడించారు.

"టీఎస్‌పీఎస్సీ ద్వారా..మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 181 గ్రేడ్-1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, సూపర్వైజర్ల ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. వీటికి మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. నిర్దేశించిన సబ్జెక్టులతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. జోన్ల వారీగా ఖాళీలు: 1 కాళేశ్వరం 26, బాసర- 27, రాజన్న- 29, భద్రాద్రి- 28, యాదాద్రి- 21, చార్మినార్- 21, జోగులాంబ- 31గా ఉన్నాయి.

ఈ ఉద్యోగాలకు అర్హతలు.. బ్యాచిలర్స్ డిగ్రీ(హోమ్ సైన్స్/ సోషల్ వర్క్/ సోషియాలజీ) లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్స్ & న్యూట్రిషన్), లేదా బీఎస్సీ (ఫుడ్ & న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ), బీఎస్సీ (ఆ షైడ్ న్యూట్రిషన్ & పబ్లిక్ హెల్త్, బోటనీ/ జువాలజీ & కెమిస్టీ). లేదా బీఎస్సీ(క్లినికల్ న్యూట్రిషన్ & డైటెటిక్స్, బోటనీ, జువాలజీ & కెమిస్టీ). లేదా బీఎస్సీ (ఆప్టైడ్ న్యూట్రిషన్, బోటనీ/ జువాలజీ & కెమిస్ట్రీ/ బయోకెమిస్ట్రీ) లేదా బీఎస్సీ (ఫుడ్ సైన్సెస్ & క్వాలిటీ కంట్రోల్, జువాలజీ బోటనీ & కెమిస్ట్రీ! బయోలాజికల్ కెమిస్ట్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.

ఇక, వయసు విషయానికొస్తే.. 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాలు ఉండాలి. దరఖాస్తు రుసుము రూ. 200, రాత పరీక్షలో రెండు పేపర్లో ఉంటుంది. పేపర్-1(జనరల్ స్టడీస్ అండ్ జనరల్, ఎబిలిటీస్), పేపర్-2 సంబంధిత సబ్జెక్టు (డిగ్రీ స్థాయి)లో ప్రశ్నలుంటాయి.పేపర్-1లో 150 ప్రశ్నలు, పేపర్-2లో 150 ప్రశ్నలు కలిపి మొత్తం 300 ప్రశ్నలు ఉంటాయి. ఆన్లైన్ దరఖాస్తులు 08.09.2022 నుంచి ప్రారంభమై 29.09.2022 ముగుస్తుంది. పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్) డిసెంబర్, 2022లో ఉంటుంది. అధికారిక వెబ్ సైట్: https://www.tspsc.gov.in/ను సందర్శించండి"అని అధికారులు తెలిపారు.

Updated : 29 Aug 2022 2:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top