మైక్ టీవీ తెలంగాణ పాట వచ్చేస్తోంది.. - MicTv.in - Telugu News
mictv telugu

మైక్ టీవీ తెలంగాణ పాట వచ్చేస్తోంది..

May 28, 2019

తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది కూడా మీ మైక్ టీవీ మరో అందమైన పాటతో మీ ముందుకు వస్తోంది. ‘ఇదేరా తెలంగాణ ఉద్యమాల ఇలాకా.. ఇదేరా తెలంగాణ పౌరుషాల పటాకా.. మాటల తూటా.. మనసు పూవుల తోట.. యుద్ధభూమిలోన మాది పోరుబాట..’ అంటూ సాగే పాటతో మిమ్మల్ని అలరించడానికి త్వరలో పూర్తి పాటతో వస్తున్నాం. విడుదలైన ప్రోమోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మంగ్లీ పాట కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నాం అని అభినందిస్తున్న ప్రేక్షుకులు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

మైక్ టీవీ పాటలు చాలా ప్రత్యేకమైనవి.. ఏ పాట వచ్చినా హిట్ అవుతుందని అంటున్నారు. మంచి సాహిత్యం.. పదం పదం తెలంగాణ ఔన్యత్యం, ఇక్కడి సంస్కృతి, మనుషుల మంచితనాన్ని అద్దం పడతాయి. అతి త్వరలో పూర్తి పాటను మీ ముందుకు తీసుకువస్తాం. ఈ పాటను కూడా ఎప్పటిలానే ఆదరించి, ఆశీర్వదిస్తారని కోరుతున్నాం.