Goodbye Elon Musk to the Twitter deal
mictv telugu

ట్విటర్ డీల్‌కు..ఎలాన్ మస్క్ గుడ్‌బై

July 9, 2022

Goodbye Elon Musk to the Twitter deal

ప్రముఖ అంతర్జాతీయ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఓ సంచలన విషయాన్ని వెల్లడించాడు. ప్రముఖ సామాజిక సంస్థ అయిన ట్విటర్ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. నకిలీ ఖాతాలకు సంబంధించి ట్విటర్ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందంలోని పలు నిబంధనలను ట్విటర్ ఉల్లంఘించిందని, ఇంతటీతో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎలాన్ మస్క్..గతంలో ట్విటర్‌ను కొనుగోలు చేయటం కోసం 44 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో ఓకే చెప్పినా ఆయన, మే నెల‌లో ఆ డీల్‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశాడు. ఫేక్ అకౌంట్ల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన‌ట్లు తెలిపారు. అయితే, ఈ డీల్‌ నుంచి తప్పుకోవడానికి గల ప్రధాన కారణాలను ఆయన ఓ ప్రకటనలో వెల్లడించాడు.

”ట్విటర్ కంపెనీ వారి నివేదికలో చెప్పినట్లుగా 5శాతం కంటే తక్కువ స్పామ్ ఖాతాలున్నట్లు ఆధారాలు చూపించే వరకు డీల్ ముందుకు వెళ్లదు. ట్విటర్ చెప్పిన దానికంటే స్పామ్ ఖాతాలు నాలుగింతలు అధికంగా ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారం కచ్చితమైనదని భావించే నేను కొనుగోలు ఒప్పందానికి అంగీకరించానని గతంలో చెప్పాను. ఆ విషయం తేలేవరకు కొనుగోలు ఒప్పందం ముందుకు వెళ్లదని మళ్లీ చేప్తున్నా. స్పామ్‌, ఫేక్ అకౌంట్ల‌ విషయంలో ట్విటర్ సరైన స‌మాచారాన్ని ఇవ్వ‌లేక‌పోకపోవడం కారణంగానే నేను ఆ ఒప్పందం నుంచి వైదొలుతుగుతున్నాను”

ట్విటర్ చైర్మన్ బ్రెట్ టెయిలో మాట్లాడుతూ.. ‘మస్క్ తో అంగీకరించిన ఒప్పందాన్ని నిబంధనల ప్రకారం రద్దు చేయడానికి ట్విటర్ బోర్డు కట్టుబడి ఉంది. అయితే, ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఏదైనా కారణంగా మస్క్ ఒకవేళ లావాదేవీని పూర్తి చేయకపోతే, 1 బిలియన్ డాలర్లను బ్రేక్ అప్ ఫీజు( పెనాల్టీ) కింద కట్టాల్సి ఉంటుంది. గత ఏప్రిల్‌లో ట్విటర్ కొనుగోలు చేసేందుకు మస్క్ 44 బిలియన్ డాలర్ల ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు. స్పామ్, నకిలీ ఖాతాల గురించి సరైన సమాచారం ట్విటర్ ఇవ్వడం లేదని గత మే నెలలోలో ఈడీలను ముందుకు వెళ్లకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. సమాచారం ఇవ్వడంలో ట్విటర్ విఫలమైందని మస్క్ తరపున న్యాయవాదులు యూఎస్ సెక్యూరిటీస్, ఎక్స్చేంజ్ కమిషన్‌కు లేఖను అందించారు” అని ఆయన అన్నారు.