గుడ్‌న్యూస్..31 ఉద్యోగాలకు ప్రకటన విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్..31 ఉద్యోగాలకు ప్రకటన విడుదల

May 10, 2022

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఎంబీబీఎస్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 31 (ఓపెన్‌ కేటగిరి) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.

ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ హైమావతి మాట్లాడుతూ..” శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీచేస్తున్నాం. ఎంబీబీఎస్‌ విద్యార్హత కలిగి, మెడికల్‌ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవడంతోపాటు, గత ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి 42 ఏళ్ల వయస్సు మించని వారు ఈ ఉద్యోగాలకు అర్హులు” అని ఆమె అన్నారు. అనంతరం ఈ ఉద్యోగాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కేటగిరీ వారికి మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మంగళవారం నుంచి ఈ పోస్టులకు ఆల్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానుంది అని, పూర్తి వివరాలకు hmfw.ap.gov.in వెబ్‌సైట్‌‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.