పదోవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీఎస్ఎఫ్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్లో మొత్తం 281 పోస్టులు ఉన్నాయి. ఇందులో మాస్టర్, డ్రైవర్, వర్క్‌షాప్ విభాగాల్లో ఎస్ఐ, హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. పదోవ తరగతి, ఇంటర్ పాసైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
”మొత్తం పోస్టులు 281.. ఎస్ఐ 16 (మాస్టర్ 8, ఇంజిన్ డ్రైవర్ 6, వర్క్‌షాప్ 2), హెడ్‌కానిస్టేబుల్ 135 (మాస్టర్ 52, ఇంజిన్ డ్రైవర్ 64, వర్క్‌షాప్ 19), సీటీ 130. ఎస్ఐ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ చేసి ఉండాలి. అభ్యర్థులు 22 నుంచి 28 ఏండ్ల మధ్య వయసు ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 20. వెబ్సైట్: https://rectt.bsf.gov.in.