Goodnews: iBOMMA is back..with download
mictv telugu

గుడ్‌న్యూస్: iBOMMA మళ్లీ వచ్చేసింది..విత్ డౌన్లౌడ్‌తో

September 15, 2022

దక్షిణాది సినీ ప్రియులకు ఐబొమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొత్తగా ఏ సినిమా రీలిజ్ అయిన ఆ సినిమాను హెచ్‌డీ క్యాలిటీస్‌తో ప్రేక్షకులకు అందిస్తూ, అలరిస్తూ వస్తుంది. తాజాగా ఐబొమ్మ ఇక పనిచేయదని, మళ్లీ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందనే విషయంపై యాజమాన్యం ఎటువంటి సమాచారాన్ని తెలియజేయలేదు. దాంతో సినీ ప్రియులు తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. తాజాగా మళ్లీ ఐబొమ్మ మొదలైంది. ఆవేదనకు గురైన అభిమానులకు ఆనందాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈసారి డౌన్లోడ్ ఆప్షన్, సెర్చ్ ఆప్షన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

”డిజిటల్ వేదికగా విడుదలైన సినిమాలను, వెబ్ సిరీస్‌లను హై క్వాలిటీతో ఈ వెబ్సైట్ ప్రేక్షకులకు అందిస్తోంది. తొలుత తమ మీద దుష్ప్రచారం చేస్తున్నారని అందుకే ఐ బొమ్మ వెబ్సైట్ పూర్తిగా నిలిపివేస్తున్నామని ఒక ప్రకటన జారీ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

ఆ తర్వాత ఐ బొమ్మ వెబ్సైట్లో కేవలం చివరి 30 సినిమాలు మాత్రమే చూసే అవకాశం కల్పిస్తూ, సెర్చ్ ఆప్షన్, డౌన్లోడ్ ఆప్షన్‌ను తీసేశారు. ఆ తర్వాత ఏకంగా ఇండియాలో తమ సేవలను నిలిపివేస్తున్నామని ప్రకటించి, ఐ బొమ్మ అందరికీ షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచిఈ సైట్ కూడా ఓపెన్ అవ్వడం లేదు. ఓపెన్ అయినా వీడియోలు ప్లే అవ్వడం లేదు. తాజాగా ఐ బొమ్మ ఒక శుభవార్త చెప్పింది. ఇండియాలో కూడా మళ్లీ తమ సేవలు మళ్లీ కొనసాగిస్తున్నామని అధికారికంగా ప్రకటించింది. ‘WW22.iBOMMA.BAR/TELUGU’ లేదా iBOMMA అని టైప్ చేసినా, ఓపెన్ అవుతుంది”.