గుడ్‌న్యూస్.. ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల - MicTv.in - Telugu News
mictv telugu

గుడ్‌న్యూస్.. ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

May 12, 2022

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. విద్యుత్‌ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. విడుదల చేసిన ప్రకటనలో.. మొత్తం 70 ఏఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ఈనెల 12వ తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులను ఆల్‌లైన్‌లో స్వీకరించనున్నట్టు అధికారులు తెలిపారు. రాత పరీక్ష జూలై 17వ తేదీన నిర్వహిస్తామని, బీటెక్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులని అధికారులు పేర్కొన్నారు.

మరోపక్క పోలీస్ శాఖలో, గ్రూప్ 1 పోస్టులకు ఇటీవలే ఉద్యోగ ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 70 ఏఈ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్దమైయ్యారు. ఈ ప్రకటనతో ఏఈ ఉద్యోగాలే లక్ష్యంగా సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ కలను సాకారం చేసుకునే అవకాశం లభించినట్లైంది.