రెగ్యులర్‌గా స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారెవరైనా సరే… ఏదైనా యాప్ కావాలంటే గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లాల్సిందే. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కోసం కానీ, అవసరాలకు కానీ యాప్ అనేది తప్పని సరి కావడంతో ప్లే స్టోర్‌లో సెర్చ్ చేయడం కామన్. అయితే యూజర్స్ అవసరాన్ని అనుగుణంగా తీసుకుని.. కొన్ని నకిలీ యాప్స్ కూడా సృష్టిస్తున్నారు కొందరు. దీని వల్ల యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుంది. అంతేకాక వారి డేటా మిస్ యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. తాజాగా ఇలాంటి నకిలీ యాప్స్ గురించి గూగుల్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్లేస్టోర్‌లోని సుమారు 9 లక్షల యాప్‌లపై చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
గత రెండేళ్లుగా ఈ యాప్‌లు అప్డేట్ కాకపోవడం, గూగుల్ రూల్స్ పాటించకపోవడంతో వీటిని బ్యాన్ చేయాలనుకుంటోంది. దీంతో ఈ యాప్‌లు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉండవని సమాచారం. అయితే గూగుల్ వీటిని పూర్తిగా తొలగిస్తుందా లేదా తాత్కాలికంగా వీటిపై నిషేధం విధిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం గూగుల్ ప్లేస్టోర్ నుంచి 150 యాప్‌లను తొలగించింది. అందుకు కారణం ఈ యాప్‌లు.. యూజర్ల డేటాను సేకరించడమే. ఈ 9 లక్షల యాప్‌లలో కూడా అలా యూజర్ల డేటాను సేకరించే యాప్స్ కూడా ఉన్నాయట. సైబర్ నేరగాళ్లు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో యూజర్లు కాస్త అప్రమత్తంగా ఉండాలని గూగుల్ చెబుతోంది. ఏవైనా యాప్‌లు డౌన్లోడ్ చేసుకునే ముందు వాటికి ప్లేస్టోర్ అథెంటికేషన్ ఉందా? లేదా? అనేది సరిచూసుకోవడంతోపాటు డెవలపర్స్ ఎవరు? ఆయా సంస్థలకు యూజర్ రేటింగ్ ఎంత ఉంది? యూజర్ల కామెంట్స్ వంటి వాటిని కూడా పరిగణలోకి తీసుకోమని గూగుల్ సూచిస్తోంది.