ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సోమవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన `గూగుల్ 8వ ఎడిషన్`లో సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ మాట్లాడుతూ.. గూగుల్ పే – Google Pay లో వాయిస్ ద్వారా`ట్రాన్సాక్షన్ సెర్చ్` ఫీచర్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. యూజర్ల కోసం డిజిలాకర్ ఫెసిలిటీని తీసుకొస్తామని ఆయన అన్నారు. ఇప్పటివరకూ కేవలం భారత్‌లోనే ఉన్న యూపీఐ ఆధారిత గూగుల్ పే సేవలను ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తీసుకురానున్నట్లు వెల్లడించారు. అలాగే.. వేలాది భాషల్లో సమాచారం పొందేందుకు శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ అభివృద్ధిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు Google Files యాప్ ద్వారా DigiLockerని కూడా యాక్సస్ చేసుకోవచ్చు. డిజిలాకర్ అనేది వర్చువల్ లాకర్. ఇందులో ముఖ్యమైన డాక్యుమెంట్లన్నింటినీ పేపర్‌లెస్ ఫార్మాట్లో డిజిటల్‌గా భద్రపరుచుకోవచ్చు. డిజిలాకర్‌లో సేవ్ చేసిన అన్ని డాక్యుమెంట్లు పూర్తిగా చెల్లుబాటు అవుతాయి.
Top 3 things we never find when we need them:
3. Most
2. Important
1. Documents 📄We are bringing @Digilocker_Ind to your Android phones, with the Files by Google app. #GoogleForIndia @GoI_MeitY @abhish18 @NeGD_GoI @digilocker_ind pic.twitter.com/RXPzscRM1i
— Google India (@GoogleIndia) December 19, 2022
గూగుల్ పేమెంట్ సర్వీసుల్లో Google Pay.. కొత్త ‘Transaction Search’ ఫీచర్‌ను ప్రారంభించబోతుంది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు తమ లావాదేవీల గురించి వాయిస్ ద్వారా తెలుసుకోవచ్చు. Google Pay ఇప్పుడు అనుమానాస్పద లావాదేవీల కోసం మరిన్ని భద్రతా హెచ్చరికలను పంపనుంది. ఇందుకోసం గూగుల్ ML అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. ఈ హెచ్చరిక గూగుల్ పే యూజర్ల ప్రాంతీయ భాషలో కూడా అందుబాటులో ఉండనుంది.
🎙️🎙️🎙️
"Fuel expenses last month"
"Grocery spends last week"The new ‘Transaction Search’ feature on Google Pay, makes it possible to track our spends, and make month-ends smoother ✨ #GoogleForIndia pic.twitter.com/7kOHWA1hXB
— Google India (@GoogleIndia) December 19, 2022
ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పలు రంగాల్లో గణనీయ మార్పులు రానున్నాయని చెప్పారు. భాషల మధ్య వ్యత్యాసం, రుణ వసతి కల్పన తదితర రంగాలతో మార్పులు తేనున్నదన్నారు.
గూగుల్ ఇండియా ఎనిమిదో సదస్సులో పాల్గొన్న తర్వాత సుందర్ పిచ్చాయ్.. ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రదాని మోదీతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు