ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులంతా వాలెంటైన్స్ డే ను జరుపుకుంటున్నారు. చాలామంది తమ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ప్రేమను పంచుకుంటున్నారు. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కూడా ఈ వాలంటైన్సన్ డే ను స్పెషల్ డూడుల్‌తో అందరికీ విషెస్ తెలిపింది. పింక్ కలర్ లో యానిమేటేడ్ డూడుల్ చాలా క్యూట్ గా… చూడగానే ముచ్చటేసేలా ఉంది. వర్షపు చినుకులతో దీనిని తయారు చేయడం విశేషం. రెండు వర్షపు చినకులు కలిసి… హార్ట్ సింబల్ గా మారుతూ ఉంది.
‘Rain or shine, will you be mine?’ అనే కొటేషన్ తో… ప్రపంచ వ్యాప్తంగా వాలంటైన్స్ డే జరుపుకుంటున్నవారికి గూగుల్ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సంవత్సరంలోని మోస్ట్ రొమాంటిక్ డేని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు గూగుల్ డూడుల్ ద్వారా… తమ ప్రేమికులు, ఫ్రెండ్స్, కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలియజేయండి అంటూ… గూగుల్ డూడుల్ తన పేజీలో పేర్కొంది.
క్రీస్తుశకం 270 నాటి ఘటన నేపధ్యంగా ఈ వాలెండైన్స్ డే ప్రారంభమైంది. నాటి రోమ్ సామ్రాజ్యం ఇందుకు వేదికగా నిలిచింది. నాటి రోమ్ చక్రవర్తి క్లాడియస్‌కు పెళ్లంటే అస్సలు పడదు. పెళ్లిళ్లపై నిషేధం కూడా విధించాడు. అదే సమయంలో వాలెంటైన్ అనే ఓ మతగురువు..అక్కడి ప్రజలకు ప్రేమ సిద్ధాంతాన్ని బోధించేవాడు. అంటే ఇప్పటి పరిభాషలో చెప్పాలంటే లవ్‌గురు. ప్రేమ సిద్ధాంతాన్ని బోధించడమే కాకుండా ప్రేమ పెళ్లిళ్లు కూడా చేయించేవాడు. పెళ్లిళ్లపై ద్వేషంతో నిషేధం విధించినా ప్రేమ పెళ్లిళ్లు పెరగడంతో క్లాడియస్‌కు కోపమొచ్చింది. ఆరా తీస్తా ఈ లవ్‌గురు వాలెంటైన్ వ్యవహారం తెలిసింది. అంతే ఆగ్రహంతో రాజద్రోహం ఆరోపణలతో మరణశిక్ష విధిస్తాడు. జైళ్లో ఉండగా..జైలు అధికారి కూతురితో ప్రేమలో పడతాడు వాలెంటైన్. ఫిబ్రవరి 14న చనిపోయేంతవరకూ ప్రియురాలి గురించి తల్చుకుంటూ..యువర్ వాలెంటైన్ అంటూ లేఖ రాస్తాడు. అదే వాలెంటైన్ డేగా మారింది.