త్వరలో క్రోమ్‌లో కొత్త ఫీచర్‌..ఆ సైట్లను గుర్తించేలా.. - MicTv.in - Telugu News
mictv telugu

త్వరలో క్రోమ్‌లో కొత్త ఫీచర్‌..ఆ సైట్లను గుర్తించేలా..

November 21, 2019

Google chrome..

గూగుల్ క్రోమ్.. ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఎక్కువగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్. కేవలం డెస్క్ టాప్ మాత్రమే కాకుండా.. మొబైల్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. తాజాగా గూగుల్ సంస్థ ఈ క్రోమ్ బ్రౌజర్ లో ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొనివస్తునట్టు సమాచారం. క్రోమ్ నెమ్మదిగా లోడ్‌ అయ్యే వెబ్‌సైట్‌లను గుర్తించేందుకు గూగుల్‌ ప్రణాళికలు వేస్తోంది. 

అలాంటి వాటిని బ్రౌజింగ్‌ చేసేటప్పుడు క్రోమ్‌లో ప్రత్యేక లేబుల్‌ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని క్రోమ్‌ డెవలప్‌మెంట్‌ టీం తమ బ్లాగ్‌లో వెల్లడించింది. అయితే, ఏ కారణం వల్ల సైట్‌ నెమ్మదిగా లోడ్‌ అవుతుందో తెలిపేందుకు కూడా క్రోమ్‌ బృందం ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు డివైజ్‌ హార్డ్‌వేర్‌ లేక నెట్‌వర్క్‌ కనెక్టివిటీలో ఏదైనా సమస్య ఉందో లేబుల్‌ ద్వారా తెలిపేలా డెవలప్ చేస్తునట్టు బ్లాగ్‌లో పేర్కొన్నారు.