గూగుల్ క్లౌడ్‌ను ఇక ఐదుగురితో పంచుకోవచ్చు..  - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్ క్లౌడ్‌ను ఇక ఐదుగురితో పంచుకోవచ్చు.. 

February 13, 2020

google cloud.

టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ కేవలం సెర్చ్ ఇంజిన్‌లా మాత్రమే కాకుండా అనేక సేవలందిస్తోంది. మెయిల్‌, డ్రైవ్‌, ఫొటోస్ వాటిలో ముఖ్యమైనవి. ఈ సేవలను వాడుకోవడానికి గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ సర్వీస్‌‌ తప్పనిసరి. ప్రతి అకౌంట్‌కి గూగుల్ ఉచితంగా 15జీబీ ఉచిత స్టోరేజ్‌ని ఇస్తుంది. 

అది సరిపోకపోతే నెలకి రూ.210 చెల్లించి అదనంగా 200 GB స్టోరేజ్‌ని పొందవచ్చు. అదికూడా సరిపోకపోతే నెలకి రూ.650 చెల్లించి 2టీబీ వరకు స్టోరేజ్ పొందవచ్చు. చాలామందికి 200 GB సరిపోదు. అలాగే 2టీబీని సమర్థంగా ఉపయోగించుకోలేరు. స్టోరేజ్ వృథా కావచ్చు. ఇలాంటి వాళ్ళ కోసం గూగుల్‌ ఓ మంచి అవకాశం ఇస్తోంది. గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ సర్వీస్‌లోని మీ స్టోరేజ్‌ని ఇక మీరు ఐదుగురు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో పంచుకోవచ్చు. ఇది కేవలం స్పేస్‌ షేరింగ్‌ మాత్రమే. మన ఫైల్స్‌ మనకు మాత్రమే కనిపిస్తాయి. మరెవరకీ కనిపించవని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.