రాజమౌళి విషయంలో తప్పు దిద్దుకున్న గూగుల్ - MicTv.in - Telugu News
mictv telugu

రాజమౌళి విషయంలో తప్పు దిద్దుకున్న గూగుల్

February 25, 2020

cgbcggcncg

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి గూగుల్ ఓ తప్పిదం చేసిన సంగతి తెల్సిందే. ఈ చిత్రానికి రాజమౌళితో పాటు మరో వ్య్తకి దర్శకత్వం వహిస్తున్నట్టు కొన్ని రోజుల క్రితం గూగుల్ లో చూపించింది. ‘ఆర్ఆర్ఆర్’ అని గూగుల్‌లో సర్చ్ చేసినప్పుడు దర్శకుల దగ్గర రాజమౌళితో పాటు సంజయ్ పాటిల్ అనే వ్యక్తి పేరు కూడా కనిపించింది. 

సంజయ్ పాటిల్‌ అనే దర్శకుడు సినీ ఇండస్ట్రీలో లేకపోవడం గమనార్హం. అలాగే నిర్మాత స్థానంలో దానయ్య పేరుతో పాటు రంజీత్ సత్రే, ప్రసన్న డియోచకే పేర్లు కనిపించాయి. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్‌ షాక్‌కు గురయ్యారు. అయితే ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ తప్పిదం అని తేలింది. ఈ తప్పిదాన్ని గూగుల్ సరిచేసుకుంది. ప్రస్తుతం గూగుల్ లో ‘ఆర్ఆర్ఆర్’ అని టైపు చేస్తే రాజమౌళి దర్శకుడని, దానయ్య నిర్మాత అని కనిపిస్తుంది. దీంతో రాజమౌళి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గూగుల్‌లో ఇలాంటి తప్పులు రావడం కొత్తేం కాదు. గతంలోనూ సినీ నటుడు బాలకృష్ణ పేరును సర్చ్ చేసినప్పుడు ఆయన మరణించినట్లుగా చూపించింది.