2021 జులై వరకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించిన టెక్ దిగ్గజం - MicTv.in - Telugu News
mictv telugu

2021 జులై వరకు వర్క్ ఫ్రమ్ హోం ప్రకటించిన టెక్ దిగ్గజం

July 28, 2020

Google Extends Work From Home Until July 2021

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నో కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే(వర్క్ ఫ్రమ్ హోమ్) అవకాశం కల్పించిన సంగతి తెల్సిందే. ఇంకా కరోనా వైరస్ కు వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. అలాగే కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని మరికొన్ని రోజులు కల్పించాలని నిర్ణయించాయి. వాటిలో టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ ఒకటి. 

తాజాగా గూగుల్ సంస్థ తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది జులై వరకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగించింది. గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ లో ఆఫీసులో పని అవసరం లేని వారికి వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత గూగుల్ సంస్థ ఈ ఏడాది జూన్‌లో ఆఫీసులు తెరువాలనుకుంది. కానీ, కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ను పొడిగించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరు గూగుల్ ఉద్యోగులకు ఈ అవకాశాన్ని అందుబాటులోకి తేనుందని తెలుస్తోంది.