తన యూజర్ల కోసం గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. తాజాగా వర్క్ స్పేస్ యూజర్ల( Work Space users) కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్లను తీసుకొచ్చింది. గూగుల్ డాక్స్, జీమెయిల్, షీట్‌లు, స్లయిడ్‌లు, మీట్, చాట్‌తో సహా దాని వర్క్‌స్పేస్ యాప్‌ల కోసం కొత్త AI ఫీచర్( AI feature )లను ప్రకటించింది. వీటి ద్వారా యూజర్లు తాము చేసే వర్క్ మరింత సులభతరం చేసింది. యూజర్లకు అన్నిరకాలుగా సౌలభ్యంగా ఉండాలని.. గూగుల్ వర్క్ స్పేస్ లో AI-ఆధారిత ఫీచర్స్‌ని యాడ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ కారణంగా ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు కొన్ని తర్వాతి పదాలు, వాక్యాలు ముందుగానే మనకు సూచనల రూపంలో కనిపిస్తాయి. అవసరం అయితే మనం వాటిని వాడుకోవచ్చు.లేదా మనకు నచ్చిన దానిని టైప్ చేయొచ్చు.రీరైట్, ప్రూఫ్ రీడింగ్ వంటివి సులభంగా చేయొచ్చు.
ఇప్పటికే మైక్రోసాఫ్ట్ టూల్స్ ఇలాంటి ఫీచర్లను అందిస్తున్నాయి. వీటికి పోటీగా డెవలపర్లు, బిజినెస్‌ల కోసం గూగుల్ కూడా తాజాగా వీటిని తీసుకొచ్చింది. గూగుల్ డాక్స్ మరియు జీ మెయిల్ లో AI- పవర్డ్ రైటింగ్ టూల్‌ను ఉపయోగించడం ద్వారా ఈజీగా వర్క్ కంప్లీట్ అవుతుంది. ఈ అవకాశాన్ని వాడడానికి మరేతర టూల్(వెబ్‌సైట్ లేదా బ్రౌజర్) సాయం అక్కర్లేదు. డైరెక్టుగా వర్క్‌స్పేస్‌లో AI ఫీచర్లను వాడుకోవచ్చు. వీటిలో భద్రత, గోప్యత వంటివి వాటికి ప్రాధాన్యత ఇచ్చారు . దీని ద్వారా జీమెయిల్ వాడుతున్న యూజర్లు తమ మెయిల్స్ డ్రాఫ్ట్, రిప్లై, సమ్మరైజ్, ప్రయారటైజ్ ఇవ్వడానికి కొత్త ఫీచర్లు ఉపయోగపడతాయి.
ఇక గూగుల్ మీట్స్‌లో ఈ ఏఐ ఫీచర్లతో కొత్త బ్యాక్‌గ్రౌండ్స్ పెట్టుకునేందుకు, నోట్స్ రికార్డింగ్ కోసం వినియోగించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తాయి. ఇవే కాకుండా AIని ఉపయోగించే డెవలపర్‌ల కోసం, కంపెనీ PALM API ని అందిస్తోంది, ఏదైనా కంటెంట్ టైప్ చేస్తున్నప్పుడు చక్కని రీతిలో రాయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. API మేకర్‌సూట్ అనే సహజమైన సాధనంతో ఇది వస్తుంది. అంతే కాదు.. ఈ AI టూల్ తో గూగుల్ స్లైడ్స్ పై ఇమేజెస్ ని క్రియేట్ చేయొచ్చు. కాలక్రమేణా ఆలోచనలను ప్రోటోటైప్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది ఇనీషియల్ ఇంజనీరింగ్, సింథటిక్ డేటా జనరేషన్, కస్టమ్-మోడల్ ట్యూనింగ్-ఆల్ కోసం సౌకర్యాలను కలిగి ఉంటుంది.