Google launches new bug bounty program, will reward Rs 25 lakh for reporting bugs
mictv telugu

రీసెర్చర్స్‌కు గూగుల్ సవాల్.. బగ్‌ను గుర్తిస్తే 25 లక్షలు

September 7, 2022

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఒక కొత్త బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ను లాంచ్‌ చేసింది. కంపెనీ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లలోని వల్నరబిలిటీస్‌ను గుర్తించే రీసెర్చర్స్‌కు.. ఈ ప్రోగ్రామ్ కింద 31,337 డాలర్లు (దాదాపు రూ.25 లక్షలు) వరకు రివార్డ్‌ అందించనున్నారు. కొత్తగా ప్రకటించిన వల్నరబిలిటీ రివార్డ్ ప్రోగ్రామ్(VRP) గూగుల్‌ సాఫ్ట్‌వేర్, GitHub యాక్షన్స్‌, అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్‌, యాక్సెస్ కంట్రోల్‌ రూల్స్‌ వంటి రిపోజిటరీ సెట్టింగ్‌లపై దృష్టి పెడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కస్టమర్లు, యూజర్లు, రీసెర్చర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గూగుల్‌ కోరింది.

మోస్ట్‌ సెన్సిటివ్‌ ప్రాజెక్టులలో ఉన్న వల్నరబిలిటీస్‌ను కనుగొన్న రీసెర్చర్లకు టాప్‌ అవార్డులు లభిస్తాయని గూగుల్‌ తెలిపింది. బాజెల్, గోలాంగ్, ప్రోటోకాల్ బఫర్స్‌, ఫుచ్‌సియా వంటి సెన్సిటివ్‌ ప్రాజెక్టులను ఉదాహరణగా పేర్కొంది. అసాధారణమైన లేదా ప్రత్యేకించి ఆసక్తికరమైన వల్నరబిలిటీస్‌ను కనుగొన్న వారికి పెద్ద మొత్తంలో రివార్డ్ దక్కుతుందని గూగుల్‌ స్పష్టం చేసింది. నగదు బహుమానానికి అదనంగా, ప్రజా గుర్తింపు కూడా లబిస్తుందని పేర్కొంది. నగదు బహుమతి గెలుచుకున్న వారు ఆ మొత్తాన్ని సేవా కార్యక్రమాలకు విరాళంగా ఇస్తే, రెట్టింపు మొత్తాన్ని తాము అందిస్తామని గూగుల్ తెలిపింది. క్రియేటివిటీని తప్పకుండా ప్రోత్సహిస్తామని ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ వల్నరబిలిటీ రివార్డ్స్ ప్రోగ్రామ్ (OSS VRP) లాంచింగ్ సందర్భంగా తెలిపింది.